![]() |
![]() |

రివాల్వర్ చేతిలో ఉంటే హీరో, విలనే కాదు, క్యారక్టర్ ఆర్టిస్ట్ కూడా రెచ్చిపోయి మాట్లాడుతుంది. అంతా రివాల్వర్ మహత్యం. అలాంటి రివాల్వర్ మా చేతికి వచ్చినా ఇలాగె ఉంటుందని కొంత మంది హీరో కట్ అవుట్స్ నిరూపించారు.
ఖత్రోన్ కే ఖిలాడీ 15 రియాలిటీ షో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా ప్రారంభమై బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ పాపులర్ అడ్వెంచర్ షో ఆగస్టు 1, 2026 నుంచి కలర్స్ టీవీతో పాటు జియో హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతోంది. అయితే, ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో నిర్వహించిన ఒక అత్యంత భయంకరమైన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఎలిమినేషన్ రౌండ్‌లో భాగంగా 'ఫియర్ ఫండా' కింద నిర్వహించిన ఈ డేంజరస్ టాస్క్‌లో పోటీదారులు పడిన శారీరక వేదన, వారి వీపుపై ఏర్పడిన తీవ్రమైన గాయాలు వీక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
ఈ ప్రమాదకరమైన 'పెయిన్ ఆక్షన్' స్టంట్‌లో ప్రముఖ నటులు గౌరవ్ ఖన్నా, కరణ్ వాహి, విశాల్ ఆదిత్య సింగ్, మరియు షగున్ శర్మ అనే నలుగురు కంటెస్టెంట్లు పాల్గొన్నారు. రోహిత్ శెట్టి వివరించిన నిబంధనల ప్రకారం.. పోటీదారులు కేవలం స్లీవ్‌లెస్ వెస్ట్ మరియు స్పైన్ ప్రొటెక్టర్ మాత్రమే ధరించి, షూటర్‌కు వీపు చూపిస్తూ ఒక వరుసలో నిలబడాల్సి ఉంటుంది. ఒక షూటర్ తుపాకీతో వారి వీపుపైకి వరుసగా రబ్బర్ బుల్లెట్లను ఫైర్ చేస్తూ ఉంటాడు. కనీసం ఇద్దరు పోటీదారులు తట్టుకోలేక ఈ టాస్క్‌ను ఆపేసేంత వరకు ఈ దాడి కొనసాగుతుందని తెలిపారు. ఈ స్టంట్ సమయంలో ఏకంగా దాదాపు 40 రబ్బర్ బుల్లెట్లు వీరి శరీరాలను తాకినట్లు షో హోస్ట్ రోహిత్ శెట్టి వెల్లడించారు. తీవ్రమైన నొప్పిని తట్టుకోలేక మొదట షగున్ శర్మ ఈ స్టంట్‌ను ఆపేయగా, ఆ తర్వాత గౌరవ్ ఖన్నా కూడా డ్రాప్ అయ్యారు. దాంతో విశాల్ ఆదిత్య సింగ్, కరణ్ వాహి మాత్రమే చివరి వరకు నిలబడగలిగారు.
ఈ విపరీతమైన టాస్క్ పూర్తయిన తర్వాత టీవీ నటుడు గౌరవ్ ఖన్నా తన వీపుపై ఏర్పడిన దారుణమైన గాయాలు, ఎర్రటి మచ్చలను ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తోటి కంటెస్టెంట్ ఓరీ (ఓర్హాన్ అవత్రామణి) ఈ గాయాలను వీడియో తీయగా, గౌరవ్ దానిని షేర్ చేస్తూ.. "టీవీలో ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఇప్పటికీ ఆ నొప్పులు గుర్తొస్తున్నాయి. నా జీవితంలోనే ఇది అత్యంత బాధాకరమైన అనుభవం. మేమంతా అనుభవించిన ఈ గాయాల మచ్చలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ్ ఖన్నా పోస్ట్ వైరల్ అయిన కొద్ది గంటల్లోనే కరణ్ వాహి కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన వీపుపై పడిన గాయాల ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికే మూడుసార్లు ఈ షోలో పాల్గొన్న కరణ్ వాహి, ఈ 15వ సీజన్ తనకు అత్యంత భయానకమైనది, శారీరకంగా తీవ్రమైన నొప్పిని కలిగించినదని వ్యాఖ్యానించారు. అలాగే "ఇది నేను చేసిన అత్యంత కఠినమైన స్టంట్. అభిమానులు ఎవ్వరూ దీనిని ఎక్కడా ప్రయోగించడానికి ప్రయత్నించకండి" అని హెచ్చరించారు.
Also read: రామాయణకి బెదిరింపులు.. థియేటర్స్ దగ్గర అడ్డుకుంటాం
ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. టీఆర్‌పీ వినోదం పేరుతో నటులను ఇలా రబ్బర్ బుల్లెట్లతో హింసించడం ఏమాత్రం తగినది కాదని, ఇది అడ్వెంచర్ కాదు, శారీరక హింస అని నెటిజన్లు మండిపడుతున్నారు. విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో షో నిర్వాహక సంస్థ బనిజాయ్ గ్రూప్ సీఈఓ దీపక్ ధార్ స్పందించారు. ఈ షో 15 సీజన్లుగా విజయవంతంగా నడుస్తోందని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు మరియు అన్ని భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూనే షూటింగ్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, గౌరవ్ ఖన్నా, కరణ్ వాహి పంచుకున్న గాయాల చిత్రాలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.
kkk 15, gaurav khanna, karan wahi, Rohit Shetty
![]() |
![]() |